సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై

Monday, January 22, 2007

సాయి ఙ్ఞానామృతం


*** చెద పురుగులు బట్టలనెలా నాశనం చేస్తాయో, అలానే ఈర్ష్యా ద్వేషములు మనిషిని కృంగదీస్తాయి.
*** కోపము మూర్ఖత్వంతో ప్రారంభం అవుతుంది, పశ్చాత్తాపము వలన నశిస్తుంది.
*** సత్ప్రవర్తన వలన దేవతలు కూడా మనుషుల వశమవుతారు.

*** సంపద మిత్రులను కలిగిస్తుంది. ఆపదలు వారిని దూరం చేస్తాయి.
*** ఒక సారి జారవిడిచిన మాటలను తిరిగి తీసుకొనలేము కనుక ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే నాలుక కత్తి
కంటే పదునైనది.
*** మనో ధైర్యముంటే ఎటువంటి భయకరమైన ఆపదలైనా మబ్బుల వలే చెదిరిపోవును.
*** వృద్దురాలైన భార్య, పాత చొక్కా, దగ్గరున్న ధనం ఈ మూడూ మనిషికి మంచి మిత్రులు.
*** ఆశ, విశ్వాశం, దానం అనేవి మూడూ మనిషికుండే సద్గుణాలు.
*** ఏ ఇంట్లో నిత్యపూజా కార్యక్రమాలు జరుగుతాయో ఆ ఇల్లే స్వర్గం.
*** మనుషుల యొక్క గొప్పతనం వారు ధరించిన దుస్తుల వలన కాదు, వారి యొక్క (సత్ప్రవర్తన) నడవడి వలన
తెలుస్తుంది.
*** ఇతరుల సుఖము కోసం తన సుఖామును త్యాగం చేసిన వాడే మహాత్ముడు.
*** గతించిన కాలమును దృష్టిలో వుంచుకొని, భవిష్యత్ గురించి ఆలోచించాలి.
*** తమ తప్పులను కప్పిపుచ్చునున్న వారే నిజమైన అంధులు, కనులు లేని వారు కాదు.
*** మనోవ్యధ వుంటే ఎంతటి బలవతులనైన నిర్బలుని చేస్తుంది.
*** ఎదుటి వారికి సేవ చేసినపుడు వారిలో అవలక్షణాలను చూసి నీవు పాపము చేయకు.
*** ఎవరు తీసిన గోతిలో వారే పడతారు.
*** ప్రేమించే గుణము వలన మనిషి దేనినైన జయింపగలడు.

No comments: